Sunday, May 8, 2016

మలేరియా నివారణ మన ఇంట్లో

మలేరియా నివారణ మన ఇంట్లో
 ఎనాఫిలస్ అనే దోమ కాటువల్ల మలేరియా వస్తుంది. దోమలు వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే మురికి గుంతలు , పల్లపు ప్రాంతాలల్లో విజ్రుంభిస్తాయి. 
అందులో ఉండే ఎనాఫిలస్ అనే దోమ కుట్టటం వలన మలేరియా వస్తుంది. అయితే దీనిని గుర్తించడం చాలా సులబం. జ్వరం వచ్చినప్పుడు విపరీతంగా చలి పుట్టటం, మధ్యమధ్యలో జ్వరం తగ్గినట్లు అనిపించటం, తిరిగి రావటం, కొన్నిసార్లు వాంతులవడం కుడా  జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు నిర్లక్ష్యం చేయక వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ అందుబాటులో లేనప్పుడు...
       మన వంటింటికి పనిచేప్పాలి........ మలేరియాను నయంచేసే ఔషదాలు మనం నిత్యం వాడే మిరియాలు, కానుగలు మలేరియా నివారణకు ఉపకరిస్తాయి....
     ఉపయోగించే విధానం: కానుగ గింజల పప్పు ఒక వంతు, దానికి పావంతు మిరియాలు కలిపి చూర్ణం చేయాలి. ఈ విధంగా చూర్ణం చేసిన మిశ్రమాన్ని ఆరు గురువింద గింజల ఎత్తుల (750 మిల్లీ గ్రాముల) చూర్ణాన్ని మంచినీటిలో కలిపి రోగికి ఇవ్వాలి. ఈ విధంగా మూడు రోజులు తీసుకున్నట్లయితే  మలేరియా పూర్తిగా నయమవుతుంది.

      కటుకరోహిని అనే ములిక వనమూలికలు అమ్మే షాపుల్లో తేలికగా దొరుకుంతుంది. దీన్ని ,వేప చెక్కనీ సమానంగా తీసుకొని తేలికగా దంచి  ఒక సీసాలో నిల్వ ఉంచుకొవాలి. రెండు చెంచాల ఈ మిశ్రమాన్ని రెండు గ్లాసుల నీళ్ళల్లో కలిపి అరగ్లాస్ మిలిగేలాగా మరిగించి వడ గట్టి తీపి కలుపుకొని తాగండి. ఇలా ఉదయం , సాయంత్రం చొప్పున రొజూ తాగితే మలేరియాగాని , తదితర విషజ్వరాలు గాని తగ్గుతాయి.

         కాకరాకు రసం గాని , చేదు పొట్ల ఆకు రసం గానీ పంచదార కలుపుకొని రొజూ తాగిన మలేరియా జ్వరం తగ్గుతుంది.
   నేలవేము మొక్క పల్లెటూళ్ళల్లో చాలా విరిగా దొరుకుతుంది.  ఇది కటిక చేడుగాను ,వేగటుగాను వుంటుంది గాని, ఇలాంటి  విషజ్వరాల్లో అద్భుతంగా పనిచేస్తుంది.దీన్ని తేనేతో తీసుకొంటే  మంచిది . తీసుకోలేని వారు ...
    నేలవేముని ఎండించి, మెత్తగా దంచి, ఒక సీసాలో భద్రపరిచి, మందులషాపుల్లో ఖాళీ క్యాప్సుల్స్ దొరుకుతాయి. ఈ క్యాప్సుల్స్ లో నేలవేము పొడిని నింపి రెండేసి క్యాప్సుల్స్ చొప్పున ముడుపుటల అవసరాన్ని బట్టి వేసుకోండి. 
     నేలవేము వలన మలేరియా తగ్గుతుంది. మలేరియాలో స్ప్లీను అనే అవయం పొట్టలో కుడివైపున వుండేది వాస్తుంది. ఈ వాపు దీని వలన తగ్గిపోతుంది. నీరసం తగ్గుతుంది. ఆకలి కమ్మగా వేస్తుంది. నీళ్ళ విరోచనాలు,
రక్తస్రావం కూడా తగ్గుతాయి.
  

No comments:

Post a Comment