కాన్సర్ - రేడియోథెరపి అవగాహన
కేన్సర్ రేడియోథెరపి అంటే.......... మీకు , మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు అది ఏ విధంగా పనిచేసేది దాని వలన కలిగే భాదలు, వాటి నివారణ మున్నగు విషయాల గురుంచి అవగాహన కోసం.
రేడియోథెరపి తీసుకునేటప్పుడు మీమ్మల్ని గూర్చి మీరు శ్రద్ద తీసుకోవడం అవసరం. ఒక్కోసారి చిన్న బాధలే పెద్ద సమస్యకు దారి తీయవచ్చును. కానీ మీకు కలిగే చిన్న చిన్న సమస్యల్ని తొలగిస్తుంది.మీ జబ్బు మీ చేయిదాటిపొందనుకునే సందర్బంలో మీ వ్యాధిని గూర్చి ముందుగ తెలుసుకుంటే కొంత ఊరట కలుగుతుంది.
ఒకసారి కేన్సర్ కు గురిఐన తర్వాతా '' రేడియేషన్ - మీరు'' అనేది మీకు ఒక భాగస్వామ్యం అనుకోవాలి. చికిస్థ కంటే ఎక్కువ కాదు....... పూర్తి వివరాలకు మీ డాక్టర్ గారిని సంప్రదించండి.......
ఇట్లు.... మీ గుండమల్ల మల్లేష్.....
కేన్సర్ - రేడియోథెరపి
రేడియోథెరపి అనగా.... .......
కేన్సర్ కణాలని చంపుటకు మిక్కిలి శక్తివంతమైన ఎలక్ట్రానుల నుండి ఉద్భవించే
X- రే కణాలని పంపించుట.
రేడియోథెరపి చికిస్థ పనిచేయు విదానం.......
మామూలుగా జీవకణాలు విభజించబడి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఒక క్రమ పద్దతిలో శరీరావయవాలు నిర్మాణానికుపకరిస్తాయి. జీవకణాలు వాటి పెరుగుదలను అరికట్టలేనప్పుడు కేన్సర్ వ్యాధి కలుగుతుంది. ఈ అసాధారణ కణాలు త్వరగా విభజింపబడి కణముల సముదాయంగా మారి కణితిగా ఏర్పడుతుంది. ఆ కణాల చుట్టూ వుండే అవయవాలలోనికి,భాగాలలోనికి వ్యాప్తి చెందుతవి.
కేన్సర్ కణాల, పునరుత్పత్తికి మూలభాగమైన DNA ను రేడియేషన్ ద్వారా చంపగలుగుతున్నాము. ఇవి చచ్చిపోయినందున అవి విభజించబడవు. ఆ విధంగా వాటి పెరుగుదల ఆగిపోయి ఆ కణతి కుంచించుకుపోతుంది.త్వరగాను, అతిగాను పెరిగే కణాల మీదే ఈరేడియేషన్ భాగా పనిచేస్తుంది.
రేడియోథెరపి ఏ విధంగా ప్రయోగిస్తారు.......
రేడియోథెరపి చికిస్థలో తర్పీదు పొందిన డాక్టర్లని "రేడియేషన్ ఆంకాలజిస్ట్" అంటారు. ఎక్కువ శక్తివంతమైన X-రేలను గాని, రేడియోయాక్టివ్ ఐసోటోపూలను గాని నిర్దిష్టంగా కేన్సర్ కణాలలోకి గాని, ఆ కణితులలోనికి గాని ప్రసరింపజేస్తారు. ఆ కిరణాలు మామూలు కణాల మీద ప్రసరించకుండా తగిన జాగ్రతలు తీసుకొని, కేన్సర్ కణాలనే నాశనంచేసేట్లుగా చూస్తారు. మామూలు కణజాలానికి షీల్డులు అడ్డం పెడతారు.
ఎన్ని రకాల జాగ్రతలు తీసుకున్న, కేన్సర్ కణాలతో పాటే మామూలు కణాలు కూడా దెబ్బతింటవి. కాని అవి నెమ్మదిగా కోలుకొని మామూలు స్థితికి చేరుకుంటవి.
రేడియోథెరపి యొక్క గమ్యం ......
అనేక రకాల కేన్సర్ జబ్బులకు,శరీరంలోని అన్ని భాగాలకు సంక్రమించే కేన్సర్ వ్యాధులకు రేడియోథెరపి నే ముఖ్యమైన చికిస్థా విదానం. ఇవి రెండు రకాలు....
కేన్సర్ వ్యాధిని నయం చేయుట., భాదలనుండి ఉపశమనం కలిగించుట......
ఎక్కువ మంది కేన్సర్ రోగులలో రేడియోథెరపి మాత్రమే చేయవల్సివుంటుంది. కానీ ఒక్కోసారి కీమోథెరపీ తోటి లేక ఆపరేషన్ల తోటి కలిపి చేయవలసి వుంటుంది. సర్జరీకి ముందు కేన్సర్, వాపు తగ్గుటకు మరియు మిలిగిన కేన్సర్ కణాలని నాశనం చేయటానికి రేడియోథెరపి చేయవలసి ఉంటుంది. కేన్సర్ కణాలు పూర్తిగా నాశనం కావడానికి ఒక్కోసారి రేడియోథెరపితో పాటు కిమోథెరపీ కూడా చేయవల్సివుంటుంది.
రేడియోథెరపి కేవలం వత్తిడి తగ్గుటకు, రక్తస్రావం ఆగుటకు, కేన్సర్ భాగం కుచిన్చుకుపోవుటకు మాత్రమే కాకుండా పై భాదలనుండి విముక్తి పొందుటకు, ఉపశమనం పొందుటకు కుడా చేయవలసి వుంటుంది.
No comments:
Post a Comment