క్యాబేజీ తో అల్సర్లకు చికిత్స
అల్సర్లతో బదపడే వాళ్లకు ఏం తినాలి ? ఏం తినకూడదు అనేది పెద్ద ప్రశ్న.........?. డాక్టర్లు సిఫార్స్ చేసినట్టుగా మందులూ, ఆహారపరమైన జాగ్రతలు తీసుకుంటూనే......... ఓ చిన్న చిట్కా పాటిస్తే సత్వర ఫలితం ఉంటుంది.
- పేగుల్లో పుళ్ళు తొందరగా మారేందుకు పచ్చి క్యాబేజీ రసం దోహదం చేస్తుంది.
- వంద గ్రాముల పచ్చి క్యాబేజీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ రసాన్ని రోజుకు రెండు మూడుసార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.
- కేవలం పచ్చి క్యాబేజీ లో మాత్రమే లభించే విటమిను - యు అల్సర్లను మాన్పుటంలో కీలకపాత్ర పోషిస్తుంది.
- కాబట్టి ఉడకించకుండా పచ్చి క్యాబేజీ రసం తాగటం చాల మేలు.
నోట్; క్యాబేజీ రసం ఎక్కువగా తాగితే మూత్రంలో మంట వస్తుంది......
ఉత్తరేణి గింజలతో పరమాన్నం తాగండి....
పెగుపూత మాడిపోతుంది.......
ఉత్తరేణి మొక్క దొరకని చోటు వుండదు. ఏ కాస్త ముళ్ళ కంప వున్నా అక్కడ కనీసం ఒకటైన ఉతరేణి మొక్క ఉంటుంది. పొడుగాటి కాండం వుండి, చివర ముల్లులాగా గింజలు ఉంటాయి. మనం నడుస్తుంటే అంటుకొంటుoటాయి కుడా.
ఈ ఉత్తరేణి గింజల్ని ఎండబెట్టి పై పొట్టు వుడిపోయేలా తేలికగా దంచి, వాటితో పరమాన్నం వండుకొని తినాలి. అంటే బియ్యానికి బదులుగా ఈ గింజల్ని వాడాలి. గుప్పెడు గింజలు అయితే చాలు.
ఈ ఉత్తరేణి గింజల పరమాన్నం పెగుపూతని అద్భుతంగా తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది.
నోట్: మరీ అతిగా తినొద్దు. మగతనాన్ని తగ్గిస్తుంది. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తినాలి.
కంట్లో సున్నం పడితే నువ్వులనూనె చుక్కలు వేయండి
ఇంటికి సున్నాలు కొట్టేప్పుడు పొరబాటున కంట్లో సున్నపు చుక్కలు పడటంగానీ, సున్నపుచేతులు కంట్లో పెట్టుకోవడంగానీ జరిగి మంటలోస్తాయి.
ముందు మంచి నీళ్ళు ఒక మగ్గులో తీసుకొని కళ్ళు నీళ్ళలో ముంచి
రెప్పకోడుతూ బాగాకడగండి. ఆ తర్వాత కొద్దిగా నువ్వుల నూనె రెండు వేస్తే సున్నానికి విరుగుడుగా ఉంటుంది.
No comments:
Post a Comment