మొటిమలు
సాధారణంగా యవ్వనదశలో ప్రధానంగా బుగ్గలమీద వచ్చు పోక్కులను మొటిమలని అంటారు. ఇవి ముఖ్యంగా బుగ్గలమీదనే కాక వీపు మీద కూడా వస్తుంటాయి.శరీరతత్వాన్ని అనుసరించి కొంతమందికి చాతి మీద,నుడురురు మీద, చేతుల మీద కుడా మొటిమలు వస్తుంటాయి. పెసరిగింజ ఆకారంలో ప్రారంభమై చిన్న రేగి కాయంత పరిణామంలో మొటిమలు రాగలవు. ఇవి దీర్గాకాలం వుండే అవకాశం లేకపోలేదు.
గులాబి రంగులో అందంగా వుండే ఈ పోక్కులను అసహ్యకరంగా తలుచుకొని భాదపడుతుంటారు. మొటిమలలో చీము వుంటుంది. బుగ్గల మీద వచ్చే మొటిమలను గిల్లకూడదు. కొంతమంది ఏమీ తోచనప్పుడు కూడా వాటిని గిల్లుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. గిల్లిన వెంటనే, మోటిమలోని చీము ఎంతో కొంతైనా చుట్టుప్రక్కలకు పాకుతుంది. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.కొన్ని సందర్భాల్లో గిల్లిన వెంటనే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపించే అవకాశం వుంది. వాస్తవానికి ఇదేమి వ్యాధి కాదు. యుక్తవయసు ప్రారంభదశలో రక్త హీనత వుండి థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోవడంతో మొటిమలు ఏర్పడుతాయి.
మొటిమలు రావడానికి ఎన్నెన్నో కారణాలను, అభూతకల్పనలు చెబుతుంటారు.యవ్వన దశలో ఇవి భావించి, సకాలంలో సరైన చికిత్స తీసుకోవాలి. ముందుగా ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి. కొవ్వు పదార్దాలాకు ( వెన్న, మీగడ, ఐస్ క్రీమ్ , చాక్లెట్ బార్, మాంసం, కోడిగుడ్లు, వేపుడు కూరలు, దుంప కూరలు, వేరుశనగ మొ..) చాలా దూరంగా వుండాలి. రోజుకు మూడు సార్లు ( నిద్రకు ఉపక్రమించే ముందు కుడా) శుబ్రముగా ముఖాన్ని వేడినీటితో ఒకటికి రెండుసార్లు కడుక్కోవాలి.
చందనం పోడిగాని, చందనం ఆయిల్ గాని తరచు మొటిమల మీద రాయడం మంచిది. లేదా చందనం మిరియాలు , జాజికాయ తొక్కలను బాగా నూరి ముద్ద చేసి , మొటిమల మీద పూత పూయాలి.
పోషకాలు శరీరానికి అందాలంటే
- ఏ కురగాయలనైన ఎక్కువగా ఉడికించకూడదు. ఆవిరిమీద ఉడికిస్తే మంచిది.
- కురగాయాలలో ఉన్న చాల విటమిన్లకు నీటిలో కరిగే గుణం ఉంటుంది. ఉడికించేటప్పుడు అవి నీటిలోకి చేరుతాయి. కాబట్టి ఉడికించడానికి తక్కువ నీటిని వాడండి.
- ఉడికించిన తర్వాత ఆ నీటిని పారబోయద్దు. రసం లేక సాంబారు చేసేటప్పుడు వాటిని వాడండి.
- కూరగాయలను వండటానికి ముందే కోయండి.
- మసాల కూరలు చేయాలంటే మొదట గ్రేవి తయారు చేసాక దానిలో చివర ఉడికించిన కూరలను కలపండి.
- కురగాయలల్లోతగినంత ఉప్పు సహజంగా నే ఉంటుంది. కాబట్టి పచ్చివి తినేటప్పుడు అదనంగా ఉప్పు కల్పవద్దు.
- విదేశాల నుండి దిగుమతైన యాపిల్స్ తినే ముందు తొక్క తీసి తినండి. ఎందుకంటే అవి మెరవడానికి సన్నని మైనపు పూత పూస్తారు.
- ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర కూరగాయలు కొనొద్దు . వాహానాలు వదిలే పొగ వాటి మీద కమ్ముకుని ఉంటుంది.
- చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం మనచేతుల్లోనే.......
No comments:
Post a Comment