Sunday, May 8, 2016

మూలశంక/మొలలు,. అజీర్ణానికి కొత్తిమీర

ఆరోగ్యానికి ఆయర్వేదం


మూలశంక/మొలలు
ములాశయం వద్ద , అర్శమూలల వద్ద సిరలు ఉబ్బి, విస్తరించిన స్థితిని  మూలశంక అర్శము, మొలలు అంటారు. ఇవి వెలుపల లేదా లోపలి వైపు ఉండవచ్చును. 
      శరీరంలో అతిగా వాతం ( వేడి ) వృద్ది అయినప్పుడు ములాశయం వద్ద మాంసపుమొలుకలు బయలుదేరి మేకులవలె గుచ్చుకోవడం జరుగుతుంది. వీటినే రక్త మొలలు అంటారు.
     శరీరంలోని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఆసనం వద్ద కలుస్తాయి. ఈ రక్తనాళాలకు శరీరంలోని వేడి అధికం కాగా వాపు వచ్చి ఉబ్బి, కాయలమాదిరిగా తయారవుతాయి. భరించలేని భాదను కల్గిస్తాయి. విరేచానానికి వెళితే , ఆ వత్తిడి వలన అవి చిట్లి రక్తం స్రవిస్తుంది. మలబద్దకం వలన విరేచనం చాలా గట్టిగా రాయి మాదిరిగా ఉండి ముక్క వలసి వస్తింది.
       మొలలు చిట్లి రక్తస్రావంజరగడం, విపరీతమైన భాద కలగడంతో భయాందోలనలు పెరిగిపోతాయి. దురద, మంట, బాధలు అన్ని ఏకమై రోగిని భయబ్రాంతులకు గురి చేస్తాయి. జీవితం మీద విరక్తి పుట్టించే వ్యాధిగా తయారవుతుంది.
                 నల్లతుమ్మ ఆకులను ముద్దగా నూరి, చిన్న చిన్న ముద్దలను రెండుపూటలా తినాలి...... లేదా దానిమ్మ  కాయపెచ్చులు ( బెరడు) రసాన్ని రెండు చెంచాలు రెండుపూటలా తాగితే రక్తస్రావం తగ్గుతుంది.
                 కరక్కాయ మీద వుండే పెచ్చులను మెత్తగా పొడిచేసి రోజూ మూడుపూటల మంచినీటితో తాగాలి.
                 లివర్ కు సంబంధిచిన వ్యాధుల వలన, విపరీత శ్రమవలన, ఆహారలోపం వలన, స్థానువుగా ఒకేచోట గట్టి ప్రదేశం మీద అధికకాలం కూర్చోవడం వల్ల, మలమూత్రములను ఆపి ఉంచే అలవాటు వలన ఈ వ్యాధి కలుగుతుంది.
               బాగా వేడిచేసే  అజీర్ణ పదార్దాలను తినకూడదు. దుంప కూరలు తినకూడదు. వేపుడుకురలు వాడకూడదు. కారం, మసాలాలకు దూరంగా ఉండాలి.
               ఆకుకూరలు వాడాలి. రాగి జావా రోజుకు నాలుగైదు సార్లు తాగడం మంచిది.  పరిగడుపున రెండుమూడు గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. ముందుగా మలబద్దకాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. ద్రవాహారం, పళ్ళరసాలు, పల్చటి మజ్జిగ తరచుగా తాగడం ఉత్తమం.
            నల్లేరు దొరికినట్లయితే దాని కాడలను చీల్చి, ఎండబెట్టి, దానిని పొడిగా చేసి, ఆ పొడికి కొద్దిగా పంచదార, నెయ్యి కలిపి పరిగడుపున సేవించాలి. మండలం రోజుల లోపే మొలలు తగ్గిపోతాయి.
            ఉత్తరేణి గింజలను బియ్యం కడిగిన నీళ్ళలో నూరి, వడగట్టి, ఆనీళ్ళను రెండు పూటలా తాగాలి. పక్షం రోజులలో గుణం కనిపిస్తుంది. దాహం వేసినప్పుడు పల్చటి మజ్జిగ తాగటం మంచింది. 
            అత్తిపత్తి  మొక్క వేళ్ళను పొడిగా చేసి, కొద్ది కొద్దిగా రెండుపూటలా మజ్జిగతో సేవించినా మొలలు తగ్గుమొఖం పడుతాయి. 



అజీర్ణానికి కొత్తిమీర

       ఒక్కోసారి కడుపు చాల ఉబ్బరంగా ఉంటుంది. అజీర్ణ లక్షణాలు వేదిస్తుంటాయి. ఇటువంటి చిన్నాచితక ఇబ్భందులు తలెత్తినప్పుడు ఉపశమనానికి ఓ చిట్కా........
          అప్పుడే చేసిన మజ్జిగలో ఒకటి, రెండు స్పూన్ల కొత్తిమీర రసాన్ని కలుపుకొని తాగితే కడుపు ఉబ్బరం ,తేమలటం వంటి అజీర్ణ లక్షణాలు ఉపశమిస్తాయి.
           సాదారణంగా మన ఇళ్ళల్లో కొతిమీరను కూరల్లో సువాసన కోసమే వాడుతుంటాం. కాని దీనిలో ఔషదగునాలు, పోషక విలువలు చాల ఉన్నాయి.
   ఇది ఆకలిని పుట్టిస్తుంది. కాబట్టి కేవలం కూరల్లో కొద్ది మోతాదులో  వాడటంతో సరిపెట్టకుండా చెట్నీ చేసుకుని అన్నం,రొట్టేల్లో తినటం, రసం తీసుకు తాగటం వంటివి మన ఆరోగ్యానికి ఎంతో మేలు.


 తేనె పూయండి.... మచ్చ మాయం...

గాయాలు; దోకుడు పుళ్ళు,కాలిన పుళ్ళు.... ఇలాంటివి వున్నప్పుడు పుండు మనిన తర్వాత రోజూ ఆ ప్రాంతం మీద తేనె రాయండి. చర్మం పై పొరలు త్వరగా వచ్చి చర్మ రంగులో మచ్చలు కలిసి పోతాయి. లేకపోతే  మచ్చలు అలాగే మిలిగిపోయే అవకాశం ఉంది.  




మలబద్దకంలో- దోసగింజలు 
                               బాగా పండిన దోసకాయ లోపలి గింజలని విడిగా తీసి ఎండబెట్టి, మెత్తగా దంచి రోజు 1-2 చెంచాల అన్నంతోగాని, మజ్జికలో గాని కలుపుకొని తీసుకోండి. 
పేగులు చక్కగా కదిలి విరేచనం సాఫీగా అవుతుంది.
                      వాతపు నొప్పులన్ని తగ్గుతాయి. నడుం నొప్పి, కీళ్ళనొప్పులు, తలనొప్పి వున్నవారు, మలబద్దకం వున్నవారుఈ గింజలని రోజు తింటే మంచిది.  
 కడుపులో మంట, పెగుపూత,గ్యాస్ ట్రబుల్ వున్న వారు కూడా ఈ దోసగింజలని తినవచ్చు.





No comments:

Post a Comment