
కిడ్ని - రాళ్ళు- వాము
ముత్ర పిండాల్లోని రాళ్ళు త్వరగా కరిగేందుకు చాలా తేలికైన ఉపాయం...
వాముని వేయించి, మెత్తగా దంచి ఒక సీసా లో భద్రపరుచుకోండి . రెండు చెంచాల పొడిని రెండు గ్లాసుల నీటిలో కలిపి , అర గ్లాస్ మిలిగేలా కాచి ఆ నీటిని వడగట్టండి. ఇదే వాము కాషాయం.
దీన్ని ఇలా రెండు పుటలు కొన్నాలపాటు రోజూ తీసుకుంటే ముత్రపిండాల్లో రాళ్ళు కరిగి బైటకుపోతాయి.
ఇంకా.........
వాత వ్యాధులు , మెదడు వ్యాధులు, స్త్రీల గర్భాశయ వ్యాధులు అన్ని తగ్గుతాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరుగుతాయి.
కడుపులోరాళ్ళు - అరటి
ముత్రపిండాల్లో , లివర్ (గాల్ బ్లాడర్) లోనువివిధ కారణాలవల్ల రక రకాల రాళ్ళు ఏర్పడే అవకాశం వుంది.
మూత్రపిండాలలో రాళ్ళని ముత్రాశ్మరి (renal calculi) అని, లివర్ లో రాళ్ళని పిత్తాశ్మరి ( gallstomes ) అని అంటారు.
కారణం ఏ దైనా ఈ రాళ్ళు కరిగి కొట్టుకుపోవాలి.
- అరటి దుంపని దంచి రసం తీసుకొని రోజూ తాగండి . ఏ రకం రాయి అయిన కరుగుతుంది.
- అరటి ఊచని కుడా రసం తీసి తేనేకలుపుకొని తాగవచ్చు.
- అరటి ఊచని కూరగా వండుకోండి.
- అరటి ఆకులో భోజనం చేయండి.
- అరటి పళ్ళు తినండి.
అరటికి సంబంధించిన సమస్తం ఈ వ్యాధి పైన చక్కగా ఉపయోగ పడుతుంది.
తలలో పేల నివారణ
సీతాఫలం ఆకులను/ గింజలను గాని
మెత్తగా రుబ్బి , తలకు బాగా అంటేలా పట్టించి అరగంట నుంచి నలబైఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి ఆతర్వాత తలస్నానం చేస్తే తలలోని పేలనుంచి విముక్తి పొందవచ్చు.
తలలో పేలతో బాధపడేవారు వెల్లుల్లిపాయరసం తీసి తలకు బాగా పట్టేలా రాసుకుంటే పేలబాద తప్పుతుంది.
పులిపిరికాయలు
వైరస్ వలన చర్మం మీద ఏర్పడే కాయలు వంటివి. అరికాలులో గురుకుగా , మొద్దుబారిన పులిపిరి కయపిలుకలు కన్పిస్తాయి. కొంత మందికి చేడు రక్తం ఉండి, లైంగిక కలయిక ద్వారా కూడా రావచ్చును. చర్మాన్ని క్షినిన్పచేసే వ్యాధిగా పరిగణించే అవకాశము వున్నది. కొన్ని రకాల లైంగిక వ్యాధులు రెండవ దశలో ఆసనము, యోని ప్రాంతాలలో దళసరి పులిపిరి కాయల సమూహం ఉంటుంది. సాదారణమైన పులిపిరికాయలు చర్మం మీద గుండుసూది తలకయంత సైజులో లేదా బటానిగింజ సైజులో ఉంటాయి. ఇవి చేతులు, కాళ్ళు, మెడ మొ,, ప్రాంతాలల్లో ఎక్కడైనా రావచ్చును. ఇవి పగిలి, దాని చీము గాని , రసం గాని చర్మానికి వ్యాపిస్తే అక్కడ కుడా పులిపిరికాయలు పుట్టుకొస్తాయి. అందుకనే దీనిని అంటూ వ్యాధిగా చెప్పుకోవాలి. ఆనేలకు చేసే చికిత్స దీనికి చేయవచ్చు. గుల్లసున్నం చిక్కగా నీళ్ళతో కలిపి ఈ పులిపిరికాయలమీద మృదువుగా దట్టంగా రాయాలి. రాలిపోయేవరకు ప్రతిరోజు.
ఆనెలు
కీలులోగాని, చేతిలోగాని బాగా పని ఒత్తిడి లేదా రాపిడి వున్న ప్రాంతంలో పెరిగే గట్టి కొమ్మువంటి చర్మపు ముద్దనే "ఆనె" అంటారు.
గాయాలు తగిలి తగ్గిపోయిన చోట కూడా చిన్న చిన్న ఆనెలు వస్తుంటాయి. ఈ ఆనెల మీద గుల్లసున్నమును తడిచేసి జాగ్రత్తగా పూతపూయాలి.
లేదా కామంచి ఆకుల రసంలో కొద్దిగా సైంధవలవణం కలిపి ఆనెల మీద రాయాలి. ఆనెలను బ్లేడుతో కోయడం వంటి పనులు చేయగూడదు.
No comments:
Post a Comment